వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ డిమాండ్
తొలి శుభోదయం టంగుటూరు:-
గాంధీ వర్ధంతి సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో టంగుటూరు పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించటం జరిగింది. ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతి లోనే కొనసాగించాలి అని గాంధీ విగ్రహం ముందు ప్రతిజ్ఞ చేయటం జరిగింది. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి విబి జి రామ్ జి పేరుతో తీసుకొచ్చిన కొత్త చట్టం రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం మోపుతూ, పేదల పొట్ట కొట్టేందుకు ఉద్దేశించినదని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ పేరు తొలగించడం అన్యాయమని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వాలు 10% నిధులతో ఈ పధకాన్ని విజయవంతం గా కొనసాగించారు అని తెలిపారు.కొత్త చట్టం వల్ల ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులు కేటాయించి న తరువాత మిగిలిన 60% నిధులను కేంద్రం విడుదల చేస్తుంది అని తెలిపారు. రాష్టాలు ఖర్చు పెట్టె స్థితిలో లేవు కాబట్టి ఈ కరువు పని కాస్త పేదలకు దూరం అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త చట్టానికి వ్యతిరేకంగా జరిగే పోరాటల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, వేసుపోగు మోజెస్, జి. అంకయ్య, ఎమ్. యానాది, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు టీ. రాము, పి. శ్రీనివాస్, మెండా శ్రీను తదితరులు పాల్గొన్నారు…