తొలి శుభోదయం ప్రకాశం:-

రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిన అవసరాన్ని వివరించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం తగ్గుతుందని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, అతివేగం నివారించడం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.పోలీసు అధికారులు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకొని బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని కోరారు. హెల్మెట్ ధరించడం అలవాటుగా మార్చుకుంటే రోడ్డు ప్రమాదాల్లో మరణాలు గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని, ప్రజల సహకారంతోనే రోడ్డు భద్రత సాధ్యమవుతుందని పోలీసులు స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *