తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా కందుకూరు డీఎస్పీ (SDPO) గారు ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని NH-16 జాతీయ రహదారిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా హైవేకు ఇరువైపులా ఉన్న అప్రోచ్ రోడ్లు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లు (Black Spots) మరియు అత్యవసర పార్కింగ్ ప్రాంతాలను (Emergency Parking Areas) ఆయన నిశితంగా పరిశీలించారు.ఈ సందర్భంగా డీఎస్పీ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు:అప్రోచ్ రోడ్ల వద్ద వాహనదారుల వేగాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రమాదకరమైన మలుపులు, బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు మరియు రేడియం గుర్తులు స్పష్టంగా ఉండేలా చూడాలన్నారు.నిబంధనలకు విరుద్ధంగా హైవేపై వాహనాలు నిలపకుండా, కేవలం కేటాయించిన ఎమర్జెన్సీ పార్కింగ్ ఏరియాల్లోనే వాహనాలు ఆగేలా పర్యవేక్షించాలని సూచించారు.అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్ వల్ల కలిగే నష్టాలపై వాహనదారులకు అవగాహన కల్పించి, రోడ్డు ప్రమాదాల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉలవపాడు ఎస్సై మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *