తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :-

మహిళలు, బాలికల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా శక్తి (Shakthi) యాప్ డౌన్‌లోడ్, రిజిస్ట్రేషన్ మరియు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించబడ్డాయి.ఒంగోలు సబ్ డివిజన్ శక్తి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శక్తి యాప్ ఉపయోగంపై అవగాహన కల్పించి, అత్యవసర పరిస్థితుల్లో SOS సదుపాయం ద్వారా తక్షణ పోలీస్ సహాయం ఎలా పొందాలో ప్రత్యక్షంగా వివరించారు. అదే విధంగా, దర్శి సబ్ డివిజన్ శక్తి టీమ్ ద్వారా దర్శి పట్టణంలో మహిళలు, యువతకు శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించి, పెద్ద ఎత్తున యాప్ డౌన్‌లోడ్‌లు, రిజిస్ట్రేషన్లు చేపట్టారు.ఇక ఒంగోలు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఒంగోలు హెడ్‌క్వార్టర్స్ టీమ్–1 ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ప్రయాణికులు, మహిళలు, విద్యార్థులకు శక్తి యాప్ ద్వారా లభించే భద్రతా సేవలను వివరించి, ప్రతి మహిళ తప్పనిసరిగా ఈ యాప్‌ను తమ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమాల సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, శక్తి యాప్ మహిళల భద్రతకు ఒక నమ్మదగిన డిజిటల్ రక్షణ వ్యవస్థగా పనిచేస్తుందని, అత్యవసర సమయంలో ఇది ప్రాణరక్షక సాధనంగా ఉపయోగపడుతుందని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *