తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :-

రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణ భద్రతను పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, గుడ్లూరు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టింది. గుడ్లూరు మండలం మోచర్ల గ్రామానికి వెళ్లే జాతీయ రహదారి–16 (NH-16) నుండి గ్రామంలోకి ప్రవేశించే మార్గాలపై ఉన్న స్పీడ్ బ్రేకర్లకు స్పష్టంగా కనిపించేలా వైట్ పెయింట్ మరియు బ్లాక్ మార్కింగ్‌లు చేయడం జరిగింది.ఈ మార్కింగ్‌ల ద్వారా వాహనదారులు ముందుగానే స్పీడ్ బ్రేకర్లను గుర్తించి వాహనాల వేగాన్ని తగ్గించుకునే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో మరియు వర్షాకాలంలో స్పీడ్ బ్రేకర్లు స్పష్టంగా కనిపించక జరిగే ప్రమాదాలను నివారించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశం.గ్రామ పరిసరాల్లో వాహనాల వేగ నియంత్రణతో పాటు పాదచారులు, విద్యార్థులు, స్థానిక ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి ముందస్తు చర్యలు కొనసాగుతాయని పోలీస్ అధికారులు తెలిపారు. ప్రజలు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *