సరైన పత్రాలు లేని 44 మోటార్‌సైకిళ్లను 2 ఆటోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-
శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు దర్శి డిఎస్పి బి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తాళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తూర్పు గంగవరం గ్రామంలోని పాముల కాలనీ ఏరియాలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సెర్చ్ లో దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, దర్శి సీఐ వై. రామారావు సర్కిల్ పరిధిలోని తాళ్లూరు, కురిచేడు, దొనకొండ ఎస్సైలు మల్లికార్జున, శివకుమార్, త్యాగరాజు మరియు అలాగే 35 మంది పోలీసు సిబ్బందితో కలిసి జల్లెడ పట్టడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ డివైస్ ద్వారా అనుమానితులను చెక్ చేసినారు.ఈ తనిఖీల్లో భాగంగా ముఖ్యంగా గంజాయి గురించి, అలాగే మత్తు పదార్థాల గురించి తనిఖీలు చేయడం జరిగింది. పాముల కాలనీ ప్రాంతానికి సంబంధించిన అన్ని ఇళ్లలో తనిఖీలు చేపట్టి, సరైన డాక్యుమెంట్లు మరియు నంబర్ ప్లేట్లు లేనటువంటి 44 బైకులు, 2 ఆటోలు గుర్తించి, ఆ వాహన యజమానులకు కొంతమందికి చలనాలు వేయటం, అలాగే రోడ్డు ప్రమాదాలు, మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే అనర్ధాలు, సైబర్ నేరాలు కొత్త చట్టాలు మరియు మహిళలపై నేరాలు మరియు శిక్షలు గురించి అవగాహన కల్పించడం కూడా జరిగింది.తదనంతరం దర్శి డిఎస్పి బి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిఐ మరియు ఎస్సైలు మరియు సిబ్బంది అందరూ కలిసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో స్థానిక ప్రజలందరినీ మమేకం చేసి గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీని కూడా నిర్వహించి, తదుపరి అక్కడి యువత, ఆటో డ్రైవర్లు, వ్యాపారులు, ప్రజల పెద్ద ఎత్తున పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు, గంజాయిని పారదులుదాం”అంటూ ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది.గంజాయి మరియు మాదకద్రవ్యాలు వినియోగం వల్ల వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం మొత్తం నష్టపోతుందని అధికారులు వివరించారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువు, క్రీడలు, ఉపాధి వంటి సానుకూల మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి విక్రయం లేదా వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Grabbed the mwmbetapk. Installation was easy and the app seems pretty intuitive. Gotta try my luck on a few games. Give it a download at mwmbetapk!