తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం పోలీసులు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి, వారి తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. తక్కువ వయసులో వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల తీవ్రతను వివరించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారికి వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. రహదారి నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణాలను కాపాడుకోగలమని స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *