తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రకాశం పోలీసులు ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్ కింద ప్రకాశం జిల్లా పోలీసులు లింగసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ నిఘా నిర్వహించారు. ఈ నిఘా ద్వారా గ్రామాలు, ప్రధాన రహదారులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు మరియు సున్నిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అనుమానాస్పద కార్యకలాపాలపై ముందస్తు చర్యలు చేపట్టారు.డ్రోన్ నిఘా సహాయంతో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ నేరాల నివారణ, చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణ మరియు ప్రజలకు భద్రతా భరోసా కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆధునిక సాంకేతికత వినియోగంతో పోలీస్ శాఖ మరింత సమర్థంగా విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఏవైనా అనుమానాస్పద విషయాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు.