తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

కంభం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగులవరం గ్రామంలో విద్యార్థినీ విద్యార్థులకు “గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్” అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడుతూ, తమ శరీర రక్షణ పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరించారు.ముఖ్యంగా.. ఎవరైనా అపరిచిత వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించినా లేదా ఇబ్బంది పెట్టినా వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఆపద సమయంలో ‘డయల్ 100′ లేదా శక్తి యాప్’ ద్వారా పోలీసుల సహాయం ఎలా పొందాలో ప్రాక్టికల్‌గా వివరించారు. చిన్నప్పటి నుండే చట్టాల పట్ల, ఆత్మరక్షణ పట్ల అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *