తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణ భద్రతను కాపాడే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు కీలక చర్యలు చేపట్టారు.NH16 పై గుడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చెవూరు క్రాస్ రోడ్ వద్ద వాహనాల వేగాన్ని తగ్గించేందుకు స్టాప్ బోర్డులు ఏర్పాటు చేశారు.అదేవిధంగా, మార్కాపురం జిల్లా పోలీసులు NH565 పై తర్లుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్రోచ్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ఈ చర్యలతో ప్రమాదాల అవకాశాలు తగ్గి, వాహనదారులు నియంత్రిత వేగంతో ప్రయాణించేలా అవగాహన పెరుగుతుందని పోలీసులు తెలిపారు.రోడ్డు భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, ట్రాఫిక్ నియమాలను పాటించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.