తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

జనసేన జనసేన ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో గురువారం జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నియోజవర్గంలో అత్యధిక ఉద్యమి సభ్యత్వాలు నమోదు చేయాలని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నేను పార్టీలో ఒక కార్యకర్తల నా జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను అంటే దానికి నా దైవం పవన్ కళ్యాణ్ కారణమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కొంతమంది ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఎవరైనా సరే నోటికొచ్చినట్లుగా పవన్ కళ్యాణ్ పై మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఆయన అన్నారు. కందుకూరు నియోజకవర్గం లో జనసేన పార్టీలో గ్రూపులు ఏర్పాటు చేసి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఉద్యమి సభ్యత్వ కార్యక్రమానికి కందుకూరు నియోజకవర్గకి పరిశీలక రాలుగా రాయపాటి అరుణనీ నియమిస్తున్నానని ఆయన అన్నారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో కందుకూరు నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్యాలు నమోదు అయ్యేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని ఆయన అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *