తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు నియోజకవర్గం లో పుట్టగొడుగుల వెలుస్తున్న అక్రమ లేఔట్ లపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లు వేసి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆయన అన్నారు. కందుకూరు మండలం పలుకూరు పంచాయతీలో బహిరంగంగానే పంచాయతీ అనుమతులు వుడా అనుమతులు లేకుండానే లేఅవుట్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఓవీ రోడ్డు హైవేలోను, పలుకూరు డొంకలో అనధికార లేఅవుట్లుగా గుర్తించిన పంచాయతీ అధికారులు వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ శాఖతో పాటు, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమ లేఅవుట్ లో ఉన్న స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని, విద్యుత్ పరఫరా కూడా ఇస్తున్నారని నిబంధనలో పాటించని అక్రమాలు లేఅవుట్లకు ఏ ప్రాతిపదికన వారు ఇవన్నీ చేస్తున్నారు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన ప్రశ్నించారు. కొండముడుసు పాలెం, మహదేవపురం, ఓగూరు పంచాయతీలలో కూడా అక్రమ లేఅవుట్లు ఉన్నాయని వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికే అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్రజలు మోసపోయామని తెలుసుకొని మాకు న్యాయం జరిగేలా చూడాలని మా దృష్టికి తీసుకువచ్చారని వారికి న్యాయం జరిగేంత వరకు సిపిఐ అండగా ఉంటుందని ఆయన అన్నారు. అక్రమ ఓట్లపై చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవటం జరుగుతుందని అప్పటికి చర్యలు తీసుకోకపోతే కార్యాచరణ రూపొందించుకొని పోరాటం చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి వై ఆనందమోహన్, సిపిఐ నాయకులు బొల్లోజుల బాల బ్రహ్మచారి తదితరులు ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *