తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం కందుకూరు మండలం పాలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అయినది.
ప్రధాన ఉపాధ్యాయులు కల్లగుంట మోహనరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మాలకొండ రాజు మాట్లాడుతూ ప్రకృతిలోనే అంతా ఉందని దానిని ఛేదించి మానవాళి మనుగడకు ఉపయోగ పడేటట్లుగా చేసేదే సైన్స్ అని చెబుతూ మన రోజువారి కార్యక్రమాలన్నీ సైన్సే అని కాబట్టి విద్యార్థులు శాస్త్రీయ దృక్పధాన్ని అలవర్చుకొని నిత్యజీవితంలో ఉపయోగించుకోవాలని కోరార. పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు నరసింహారావు మాట్లాడుతూ నోబుల్ బహుమతి గ్రహీత భారతరత్న సివి రామన్ రామన్ ఎఫెక్ట్ ని కనిపెట్టిన సందర్భంగా భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన సైన్సు దినోత్సవాన్ని నిర్వహిస్తుందని ఇలాంటి ప్రత్యేక దినోత్సవాలు నిర్వహించినప్పుడు విద్యార్థులు వాటిని గురించి అవగాహన చేసుకోవాలని మంచి సైంటిస్టులుగా తయారు కావాలని కోరారు.కార్యక్రమానికి ముందుగా సివి రామన్ గారి చిత్రపటానికి పూలమాల అలంకరణ చేయడమైనది. చివరలో సైన్సు దినోత్సవ సందర్భంగా ప్రాజెక్టుల రూపకల్పనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడమైనది స్వీట్స్ పంచడమైనది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రమణయ్య మల్లికార్జునరావు సుబ్బారావు కోటేశ్వరరావు సుప్రియ మేడం బాపయ్య వెంకట్రావు బ్రహ్మయ్య సుధా లక్ష్మి మేడం మొదలగువారు పాల్గొనినారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *