తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ప్రకాశం జిల్లా పోలీసులు మహిళల రక్షణ మరియు అభ్యున్నతి కోసం వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఈ అవగాహన సదస్సులలో మహిళా సాధికారత (Women Empowerment), లింగ సమానత్వం (Gender Equality) మరియు మహిళలపై జరుగుతున్న నేరాల నివారణపై పోలీసు అధికారులు క్షుణ్ణంగా వివరించారు.సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు మరియు గృహ హింస వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ.. వీటికి సంబంధించిన చట్టపరమైన శిక్షలు (Crime Against Women Related Offences) మరియు మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి వివరించారు. ముఖ్యంగా ఆపద సమయంలో ఉన్న మహిళలు భయం వీడి పోలీసుల సహాయం పొందేలా డయల్ 100, 112 మరియు శక్తి యాప్ (Shakti App) వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. లింగ వివక్ష లేని సమాజం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడమే పోలీస్ శాఖ ప్రధాన ప్రాధాన్యత అని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *