తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం టౌన్ పోలీసులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా శ్రీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం టౌన్ సిఐ గారు పాల్గొని మహిళా పోలీస్ సిబ్బందిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మహిళల గౌరవం, సమానత్వం మరియు వారి సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది అందరూ కలిసి మహిళా సిబ్బందికి శ్రీమంతం చేసి వారిని సత్కరించారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.