తొలి శుభోదయం న్యూస్ కురిచేడు:-

కురిచేడు మండలం బోధనంపాడు గ్రామంలో వీరాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం టిడిపి–జనసేన–బీజేపీ కూటమి ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ప్రభల వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలల్లోనే పల్లెల్లో అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని, గతంలో నిర్లక్ష్యానికి గురైన అనేక ప్రాజెక్టులను మళ్లీ ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వెలుగొండ ప్రాజెక్టు కాలువల విస్తరణతో దొనకొండ, కురిచేడు ప్రాంతాలకు సిరులు కురుస్తాయని చెప్పారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *