తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
గిద్దలూరు మండలంలోని బురుజుపల్లి గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యారులకు సదరు గ్రామంలోని మాజీ సైనిక ఉద్యోగుడైన వెంకట రంగయ్య , పాఠశాలకు క్రికెట్ కిట్ మరియు 4 కుర్చీలు ప్రదానం చేశారు. అదే గ్రామానికి చెందిన అరిగెల వీర నారాయణ పాఠశాల అభివృద్ధికి తనవంతుగా 3000 రూపాయలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన E .వెంకటేశ్వర్లు సారు గ్రామ సర్పంచి శేషగిరి , SMC చైర్మన్ లక్ష్మీనారాయణ , పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు అందరూ పాల్గొనడం జరిగింది వెంకటరంగయ్య ,ని వీరనారాయణ ,ని ఉపాధ్యాయులు, పిల్లలు,గ్రామ పెద్దలు అందరూ వారు చేసిన దాన గుణాన్ని మెచ్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించి కృషి చేయమని కోరగా వారు సహాయం చేస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో వెంకటరంగయ్య ,ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు అందరి తరపున శాలువతో సన్మానం చేయడం జరిగింది….