తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు మండలం, ఓగూరు గ్రామంలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” పట్టాదారు పాస్‌బుక్ పంపిణీ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి మరియు అధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది. రైతులకు వారి భూములపై పూర్తి హక్కు కల్పిస్తూ ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్‌బుక్కులను అందించడం ఆనందంగా ఉంది.గత ప్రభుత్వంలో పబ్లిసిటీ పిచ్చితో రైతుల పాస్‌బుక్కులపై, సర్వే రాళ్లపై ఎక్కడపడితే అక్కడ తన చిత్రాలను ముద్రించి ప్రజల సొమ్మును వృథా చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం పట్టాదారు పాస్‌బుక్కులను రాజముద్రతో అధికారికంగా ముద్రించి రైతులకు గౌరవప్రదంగా అందిస్తోంది..రైతు హక్కుల పరిరక్షణకు మా ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలియజేశాను..