తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
మార్చి 8వ తేదీన జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ మహిళా పోలీస్ సిబ్బందికి మరియు జిల్లా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల పట్ల గౌరవం, సమానత్వం మరియు సాధికారతను పెంపొందించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమన్నారు.
మహిళలు స్వశక్తిపై ఆధారపడి సమాజంలో గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. స్త్రీలు తమలోని సహజమైన సృజనాత్మకతను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాలలోనూ రాణించాలని సూచించారు. అలాగే మహిళలు ఉత్తమ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు.