తొలి శుభోదయం న్యూస్ పల్నాడు:-
పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, ఇస్సప్పాలెం గ్రామంలో శనివారం ఆర్యవైశ్య యువజన సంఘం ఆహ్వానం మేరకు నిర్వహించిన శ్రీ మహంకాళి అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళలతో కలిసి పొంగల్లు వండించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు.