తొలి శుభోదయం న్యూస్ అనంతవరం:-
అనంతవరం గ్రామంలో సింగరేణి కాలరీస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కసుకుర్తి బాలకోటయ్య మరియు ప్రముఖ న్యూ రా ల జిస్ట్ dr అనిల్ కుమార్ MD DM ఆధ్వర్యంలో, ఒమెగా హాస్పిటల్స్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది.ఈ వైద్య శిబిరం అనంతవరం గ్రామంలోని అంగన్వాడి స్కూల్ ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించారు. సుమారు 500 ల మంది రోగులు వైద్య సేవలు పొందారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నిపుణ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, న్యూరాలజీ, గైనకాలజీ, ENT, ఆర్థోపెడిక్, నేత్ర వైద్య విభాగాలకు చెందిన నిపుణ వైద్యులు పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా BP, షుగర్ పరీక్షలు, ECG, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక పరీక్షలు తదితర ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన మందులను కూడా అందజేశారు.
ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త బెల్లం జయంత్ బాబు, ఒమేగా హాస్పిటల్స్ వైద్యులు మేడిద కోటేశ్వర రావు, dr CH మోహన వంశీ, dr M G నాగ కిషోర్, డా. వై. ఆదిలక్ష్మి, డా. హనుమంతరావు తమ సందేశాలలో గ్రామీణ ప్రాంత ప్రజలకు నిపుణ వైద్య సేవలు అందించడం ఎంతో అవసరమని తెలిపారు. ఇటువంటి వైద్య శిబిరాలు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వైద్యులు మరియు నిర్వాహకులను వారు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు కసుకుర్తి వెంకట్, కార్యదర్శి యరమాల రాజు, సభ్యులు జలారామయ్య, కృష్ణయ్య, SE కోటేశ్వరరావు, కృష్ణారావు, చినసుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ వైద్య శిబిరానికి హాజరై తమ ఆరోగ్యాన్ని పరీక్షించించుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో మేలు చేస్తాయని గ్రామస్తులు తెలిపారు.