తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్ప్రింగ్ బోర్డు స్కూలు ప్రిన్సిపాల్ జాడి శ్వేత మరియు పాఠశాల సిబ్బంది స్థానిక ప్రముఖులు గిద్దలూరు అటవీశాఖ అధికారిని నిషా కుమారి (IFS) ని మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన అటవీ అధికారి , సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. కుటుంబం నుండి సమాజం వరకు ప్రతి రంగంలో మహిళలు విశేష ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సమాజం మరింత అభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా స్ప్రింగ్ బోర్డు ప్రిన్సిపాల్ శ్వేత మాట్లాడుతూ విద్య, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసంతో మహిళలు ప్రతి రంగంలో ముందుకు సాగుతున్నారని అన్నారు. మహిళల శక్తి, సహనం మరియు నాయకత్వం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి మహిళ నిషకుమారి లాగ తన సామర్థ్యాన్ని నమ్ముకుని ముందుకు సాగితే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు.మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, మహిళలు వాటిని సద్వినియోగం చేసుకుని తమ జీవితాల్లో పురోగతి సాధించాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *