తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురం పట్టణంలో హృదయాన్ని హత్తుకునే సేవా కార్యక్రమం నిర్వహించబడింది. ఆదివారం మార్కాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆసుపత్రి పరిశుభ్రత కోసం నిత్యం శ్రమిస్తున్న మహిళా శానిటరీ సిబ్బందికి చీరలు పంపిణీ చేసి ఘనంగా సత్కరించారు. సమాజ ఆరోగ్యానికి కీలకమైన పరిశుభ్రత బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఈ మహిళల సేవలను గుర్తించి వారికి గౌరవం తెలియజేయడం కార్యక్రమం ప్రత్యేకతగా నిలిచింది.
ఈ సందర్భంగా మానవతా సేవా సంస్థ చైర్మన్ గుంటక వనజాక్షి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో పరిశుభ్రత కోసం అహర్నిశలు కష్టపడుతున్న శానిటరీ సిబ్బంది సేవలు అమూల్యమని తెలిపారు. వారి సేవలకు గుర్తింపుగా మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు అందజేసి సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మానవతా సేవా సంస్థ అధ్యక్షులు గుంటక సుబ్బారెడ్డి, ట్రెజరర్ టి. శ్రీనివాసరావు, ఆర్.కే.జి నర్సింహం, మహిళా సభ్యులు కే. మల్లేశ్వరి, వి. భూలక్ష్మి, ఎన్. సుజాత, పి. స్వప్న తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆసుపత్రి సిబ్బంది, స్థానికులు కూడా హాజరై మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
చీరలు అందుకున్న మహిళా శానిటరీ సిబ్బంది మానవతా సేవా సంస్థకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *