తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు పట్టణంలోని జడ్పీ బాలుర హైస్కూల్ లో…. ఐసిడిఎస్, డిఆర్డిఏ, మెప్మా శాఖల ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో MLA నాగేశ్వరరావు మాట్లాడుతూ….మహిళలు సదా గౌరవనీయులు. పురుషులతో సమానంగా ప్రతిభ కనబరుస్తూ అన్నిరంగాలలో దూసుకు వెళుతున్నారు. మహిళలు స్వయం శక్తివంతులుగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తోంది. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడటంతో పాటు, ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలి.
ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువచ్చిన డ్వాక్రా గ్రూపుల వ్యవస్థ రాష్ట్ర మహిళల దిశను మార్చేసింది. మహిళల వంటకష్టాలు చూడలేక దీపం పథకాన్ని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి ఆయన. చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం, స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు.. ఇవన్నీ ఈ ప్రభుత్వంలో మహిళలకోసం అందిస్తున్న పథకాలు. ఆడబిడ్డల చదువుల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, పేదింటి ఆడ పిల్లల పెళ్లిళ్ల కోసం ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకాలు కొత్తగా అమల్లోకి వచ్చాయి. ఆడబిడ్డల సంక్షేమం కోసం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించింది ఎక్కువగా మహిళలే. డ్వాక్రా సంఘాలు మరింత బలోపేతం కావాలి. కందుకూరు నియోజకవర్గంలో త్వరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కాబోతోంది. యువతులు, మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. త్వరలో వివోఏలకు సెల్ ఫోన్లు, ఏపీఎంలకు ల్యాప్ టాప్ లు ఇవ్వబోతున్నారు. 18 సంవత్సరాల లోపు యువతులకు వివాహాలు చేయవద్దు. వారిని చక్కగా చదువుకోనివ్వండి. కందుకూరు నియోజకవర్గం పారిశ్రామిక కేంద్రంగా మారబోతోంది. త్వరలో వేల సంఖ్యలో ఉద్యోగాలు రాబోతున్నాయి. సబ్ కలెక్టర్ హిమవంశీ మాట్లాడుతూ దేశంలోని ఐఏఎస్ లలో 40 శాతం మంది మహిళలు ఉన్నారని తెలిపారు. మన రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు పనితీరుకు దేశంలోనే గుర్తింపు ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను అందిపుచ్చుకొని, మహిళలు మరింత బలమైన శక్తిగా ఎదగాలని సబ్ కలెక్టర్ ఆకాంక్షించారు. అంతకుముందు సబ్ కలెక్టర్ హిమవంశీ, మున్సిపల్ కమిషనర్ అనూష, ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ ఇంద్రాణి తదితరులతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం వ్యాప్తంగా 1683 స్వయం సహాయక సంఘాలకు, 238 కోట్ల రుణాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. వివిధ రంగాలలో ఉత్తమ సేవలందించిన మహిళా మణులను ఘనంగా సత్కరించడంతోపాటు, మెమెంటోలు అందజేశారు. వేడుకలకు హాజరైన మహిళలందరికీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు ఉచితంగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు కల్లూరి శైలజ, ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు పువ్వాడి మౌనిక, మెప్మా సీఎంఎం ఫణికుమారి, మెడికల్ ఆఫీసర్ బ్యూలా గ్రేస్, సమైక్య అధ్యక్షురాలు, ఏపిఎంలు, వివోఏలు, ఆర్పీలు, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *