తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

స్థానిక మల్లె తోటలోని నాల్గవ లైన్ లో ఉన్న ఒక ప్రార్ధన మందిర ఆవరణము నందు పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేయడం జరిగినది .
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అగాపే లవ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ పల్లికొండ రవికుమార్ మాట్లాడుతూ ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పరీక్ష సామాగ్రి పంపిణీ ( పరీక్ష అట్ట ,మ్యాథమెటికల్ బాక్స్, లాంగ్ స్కేల్, పెన్సిల్, పెన్) పదిమంది విద్యార్థులకు పంపిణీ చేయటం జరుగుతుందని “నేటి బాలికలే — రేపటి మహిళలు”
గనుక బాలికలు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించి భారతదేశానికి మంచి పేరు తీసుకుని వచ్చేలాగా ఉండాలని తెలియజేసినారు
ఈ కార్యక్రమంలో స్థానిక దైవ సేవకులు సాల్మన్ రాజు , శ్రీనివాస్ నాయక్ , జేమ్స్, మాధవ , ఆదిలక్ష్మి, రాజారం , విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు .

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *