తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

జిల్లావ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 144ను కఠినంగా అమలు చేస్తున్నారు. అసంబంధిత వ్యక్తులు గుమికూడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు మాస్ కాపీయింగ్ వంటి అక్రమాలు జరగకుండా జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షలు ముగిసే వరకు ఇదే విధమైన పటిష్ట భద్రత కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *