తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ (DCC) సమీక్షా సమావేశం జరిగింది.లక్ష్యం : ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పం. రుణాల మంజూరు : స్వయం సహాయక సంఘాలకు (SHGs) విరివిగా రుణాలు అందించి, వారి ఆర్థిక పురోభివృద్ధికి సహకరించాలని బ్యాంకర్లకు సూచన. ‘ స్వయం’ యాప్ : మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా ‘స్వయం’ యాప్ వినియోగంపై దిశానిర్దేశం.విశ్వకర్మ పథకం : లబ్ధిదారులకు రుణాలను సత్వరమే మంజూరు చేయాలని ఆదేశం.డిజిటల్ అక్షరాస్యత : డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీ పోస్టర్ల ఆవిష్కరణ మరియు లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాల అందజేత.