తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-

కందుకూరు పట్టణంలోని డి.ఎస్.పి. కార్యాలయంలో కందుకూరు డి.ఎస్.పి. పోలీస్ అధికారులతో ప్రత్యేక క్రైమ్ మీటింగ్‌ను నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కందుకూరు సి.ఐ., కందుకూరు రూరల్ ఎస్.ఐ., మరియు ఉలవపాడు ఎస్.ఐ.లు పాల్గొన్నారు. ముఖ్యంగా కోర్టు ద్వారా జారీ అయి, అమలుకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ల (NBW) పై డి.ఎస్.పి. సుదీర్ఘంగా చర్చించారు. ఏళ్ల తరబడి తప్పించుకు తిరుగుతున్న నేరస్థులను తక్షణమే పట్టుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.వారెంట్లు అమలు చేయడంలో జాప్యం వహిస్తే సహించేది లేదని, ప్రతి కేసులోనూ పురోగతి ఉండాలని డి.ఎస్.పి. స్పష్టం చేశారు. వీటితో పాటు పోలీస్ స్టేషన్ల వారీగా నమోదైన పాత నేరాలు, దొంగతనం కేసులు, మరియు శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించేలా దర్యాప్తును వేగవంతం చేయాలని, నిరంతరం గస్తీ నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా, పారదర్శకంగా పనిచేస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచాలని అధికారులకు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *