తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ కందుకూరు వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉద్యోగరీత్యా అందరికీ సముచిత సేవలు అందిస్తూ, మంచి మనసుతో ఆలోచిచిస్తూ సమాజ సేవలో ఎప్పుడూ ముందు ఉండి అడగంగానే వెంటనే స్పందించి తనవంతు సహాయ సహకారాలు అందించే ఐ.ఎఫ్.సీ ఫౌండేషన్ ఆత్మబంధువు, కందుకూరు నియోజకవర్గ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ గా నియమించబడ్డ సందర్భంగా ఎస్.విజయభాస్కర్ ని ఫౌండేషన్ సభ్యులు సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ఫౌండేషన్ సెక్రటరీ షంషేర్ మాట్లాడుతూ ముస్లింలకు పవిత్రమైన ఈ రంజాన్ మాస నెలలో పేదవారికి రమజాన్ తోఫా రేషన్ కిట్లకుగాను ఆర్థిక సహాయం అందించిన విజయభాస్కర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఫౌండేషన్ కి వారు అందిస్తున్న సహాయ, సహకారాలు మరువలేనివి అని భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ట్రెజరర్ హఫీజ్, ఇంచార్జ్ ఆయుబ్ ఖాన్ పఠాన్ పాల్గొన్నారు.

By JALAIAH

One thought on “ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ గా నియమితులైన ఎస్.విజయభాస్కర్ ని సత్కరించిన ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ సభ్యులు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *