తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి పట్టణంలోని శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరుణాల 56వ వార్షికోత్సవం సందర్భంగా దర్శి పట్టణం అద్దంకి రోడ్డు 19వ వార్డు (పుచ్చలమెట్ట) లో టిడిపి నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ ప్రసంగించి భక్తులకు తిరుణాల శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు , దర్శి సొసైటీ అధ్యక్షులు మరియు టిడిపి సీనియర్ నాయకులు కలువకొలను చంద్రశేఖర్ , దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య , దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు , ఒంగోలు పార్లమెంటు టిడిపి ఉపాధ్యక్షులు కాట్రాజ్ నాగరాజు , దర్శి మండల టిడిపి అధ్యక్షులు మరెళ్ల వెంకటేశ్వర్లు , దర్శి పట్టణ టిడిపి అధ్యక్షులు పిల్లలచెరువు సత్యనారాయణ పాల్గొన్నారు.