ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో గిద్దలూరు రూరల్ సర్కిల్ సీఐ గారు, కొమరోలు ఎస్‌ఐ గారు, రాచర్ల ఎస్‌ఐ గారు మరియు పోలీసు సిబ్బంది పాల్గొని రాచర్ల మండలంలోని పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టారు.అనంతరం గ్రామ ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, దేవాలయాల్లో చోరీలను నివారించేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు గురించి అవగాహన కల్పించారు. ప్రజలు అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద కదలికలు లేదా నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *