తొలి శుభోదయం న్యూస్ మర్రిపూడి:-

మండల కేంద్రమైన మరిపూడి గ్రామపంచాయతీ పరిధిలోని రాజుపాలెం,గంగపాలెం, దుగ్గిరెడ్డిపాలెం ,పొట్టి రెడ్డిపాలెం, మండల హెడ్ క్వార్టర్ ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ,పడమటి బజారు తూర్పు బజారు పుర వీధులలో మురికి కాలువల్లో పూడిక తీత పనులు ముమ్మరంగా చేయిస్తున్నట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి బి.వి నాయుడు తెలిపారు, ఈ సందర్భంగా శుక్రవారం నాడు ఎంపీడీవో షేక్ నాగూర్ వల్లి ఆయా గ్రామాల్లో జరుగుతున్న పనులను ఆయన స్వయంగా పరిశీలించారు, ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామపంచాయతీ నిధులతో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా పనులు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో ఏఓకే విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *