తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

గిద్దలూరు పట్టణం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురం జిల్లాలోని గ్లోబల్ హెల్ప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో
మదర్ థెరిసా జాతీయ సేవాపురస్కారం అందుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
ఫౌండేషన్ వారు బి య స్. నారాయణ రెడ్డి సంఘ సేవకులను గిద్దలూరు పురపాలకo లోని “స్ప్రింగ్ బోర్డు పాఠశాలవారి ఆధ్వ ర్యంలో శుక్రవారం నాడు అభినందన కార్యక్రమంనిర్వ హించారు ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ జేవీ నారాయణ భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు హాజరై ప్రసంగిస్తూ సమాజ హితం కోరుతూ తమ స్వలాభం కంటే సామాజిక శ్రేయస్సుకోసం అను క్షణం ఆలోచనలుచేస్తూఆపదలో కష్టాల్లోఉన్నవారికిఆపన్న హస్తం అందిస్తూ చైతన్యం నింపేవారే నిజమైన సమాజ సేవకులు బిఎస్ నారాయణరెడ్డి లాంటివారు అని కొనియాడారు ఈ సందర్భంగా సన్మాన గ్రహిత ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగ టీచర్ బి యస్ నారాయణరెడ్డిని పాఠశాల యాజ మాన్యం ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది సంయుక్తంగా శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు అనంతరం బి యస్ నారాయణరెడ్డి మాట్లాడుతూ సమాజంలో సేవ చేయడానికి మంచి మనసు గట్టి సంకల్పం ఉంటే చాలు ఎంతటి సాహసమైనా చేయవచ్చన్నారు అందులో భాగంగా అనాధ శవాలకు అంత్యక్రియలు ఆధ్యాత్మికంగానూ సామాజికంగానూ నిరంతరం సమాజ సేవలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు నన్ను గుర్తించి సత్కరించినందుకు స్ప్రింగ్ బోర్డ్ యాజమాన్యానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మని చైతన్య ప్రిన్సిపల్ జాడి శ్వేత యువ ప్రగతి పథంసంస్థ అధ్యక్షులు సయ్యద్ ఫరూఖ్ వాసవి జాగృతిమిత్ర మండలి క్లబ్ అధ్యక్షులు శివాపురం హరికృష్ణ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు బాల బాలికలకు హాజరైనారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *