తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-
INTSO ఒలింపియాడ్ రెండో స్థాయి ఫలితాల్లో ప్రకాశం జిల్లా కనిగిరి శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన INTSO పరీక్షల్లో గ్రాండ్ ప్రైజ్, మొదటి, రెండో, మూడో బహుమతులు, కన్సోలేషన్ ప్రైజులు, గోల్డ్ మెడల్స్ మరియు స్పెషల్ బహుమతులు సాధించి పాఠశాలకు గౌరవం తెచ్చారు. మూడవ తరగతి విద్యార్థిని పుట్టా భూమిక గ్రాండ్ ప్రైజ్‌గా ల్యాప్‌టాప్ అందుకోగా, ఎస్కే అలీనా మొదటి బహుమతిగా ట్యాబ్, పీ వెంకట వంశీ రెండో బహుమతిగా ట్యాబ్ సాధించారు. ఈ సందర్భంగా విజేతలకు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.