తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వర రావు సింగరాయకొండ గ్రామపంచాయతీలో హౌస్ టాక్స్ కలెక్షన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పరిశీలించారు మంగళవారం ఇంటి పన్నులు రూపాయలు మొత్తం 1,05,874/- రూపాయలు ( ఈరోజు మొత్తం వసూలు చేయబడిన అసెస్మెంట్లు- 89) వసూలు చేయడంపై,అసంతృప్తి వ్య క్తం చేశారు. గ్రామపంచాయతీ ప్రతిరోజు టార్గెట్ 10.00 లక్షలు కావున V.O.A సహకారంతో వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పంచాయతీ నందు 2025-26 ఆన్లైన్ టాక్స్ కలెక్షన్ నేటికీ 43% ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మిగిలిన ఉన్న హౌస్ టాక్స్ అస్మెంట్స్ ను మార్చి 20 తేదీలోపు పూర్తి చేయాలని పంచాయతీ అభివృద్ధి అధికారి ని ఆదేశించారు.. అలాగే స్వర్ణ సచివాలయ సిబ్బందిని టీమ్స్ వారీగా పెండింగ్ ఉన్న ఏరియాలలో నియమించాలని .. అలాగే ప్రజలకు స్వర్ణ పంచాయతీ ఆన్లైన్ విధానాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారుగ్రామపంచాయతీకి సంబంధించిన మొత్తం డిమాండ్ రూ 239.28/- లక్షలు కాగా, ఇప్పటివరకు రూ.103.38/-లక్షలు వసూలు చేయబడింది.అనగా 43.22% శాతం మాత్రమే వసూలు చేయబడింది మిగిలిన రూ. 135.81 లను మార్చి 20 వ తేది లోపు కలెక్షన్ చెయ్యవలసిందిగా ఆదేశించారు. కమిషనర్ పంచాయతీ రాజ్ మరియు కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మార్చి 20 నాటికి ఇంటి పన్నులు మరియు
పన్నెతరములు 100 శాతం వసూలు కావాలి. పెండింగ్ బకాయిల వసూళ్ల కోసం ప్రత్యే క బృందాలు 6 (స్పెషల్ టీమ్స్ ) ఏర్పా టు చేసిన వారితో ఫీల్డ్ విజిట్ చెయ్య డమైనది తక్షణ చర్య లు తీసుకొని 100% వసూళ్లు పూర్తి చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.ఇంటి పన్ను వసూళ్లలో ఎటువంటి నిర్లక్ష్యం, ఆలస్యం లేదా నిర్లిప్తత సహించబడదని, బాధ్యులపై చట్టపరమైన మరియు శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టంగా హెచ్చరించారు.కాబట్టి సంబంధిత సిబ్బంది అందరూ దీనిని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, రోజువారీ ప్రణాళికతో వసూళ్లు వేగవంతం చేసి, వెంటనే వసూలు చేయవలసిందిగా ఆదేశించినారు, స్వయంగా ఇంటి పన్ను కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించి ఇంటి పన్ను వసూలు చేయించినారు. ఈ విషయంలో ఎంపీడీఓ , డిప్యూటీ ఎంపీడీఓ మరియు ఎం జి ఓ లు ప్రత్యే క దృష్టి పెట్టి, సంబంధిత సిబ్బందితో సమన్వయం చేసుకుని వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు.అందరూ ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పన్నుల వసూళ్లను వేగవంతంగా పూర్తి చేయవలసిందిగా ఆదేశించినారు ఈ కార్యక్రమం లో. జిల్లా పంచాయితీ అధికారి ఎం . వెంకటేశ్వరరావు. ఎంపీడీఓ ఎల్. జయమని , డిప్యూటీ. ఎంపీడీఓ పి . వెంకటరావు పంచాయతీ డెవలప్మెoట్ ఆఫీసర్స్ శారదా మరియు హౌస్ టాక్స్ కలెక్షన్ టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు .