తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీసు:-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు–2026 సందర్భంగా, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.విద్యార్థులు ప్రశాంతంగా, ఎలాంటి భయాందోళనలు లేకుండా పరీక్షలు రాయడానికి అనుకూల వాతావరణం కల్పించడం ప్రధాన లక్ష్యంగా, ట్రాఫిక్ నియంత్రణ, పహారా బందోబస్త్, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా వంటి చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. పోలీసుల ‘విజిబుల్ పోలీసింగ్’ ద్వారా తల్లిదండ్రులు మరియు విద్యార్థుల్లో విశ్వాసం పెంచుతూ, సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.ప్రజలు కూడా పోలీసులకు సహకరించి, పరీక్షల సమయంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *