అధికారులకు అభినందనలు తెలిపిన మంత్రి డిఎస్ బీవీ స్వామి
తొలి శుభోదయం న్యూస్ అమరావతి:-
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ జ్ఞానభూమికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది. జ్ఞానభూమి పోర్టల్ ద్వారా విద్యార్థులకు రియల్ టైం లో సేవలు అందించింనందుకుగానూ ఈ అవార్డు దక్కింది. ఈ నెల 28 న (28 మార్చి 2026) ఢిల్లీలో జరిగే అవార్డుల ప్రధాన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ IAS బి. లావణ్య వేణి ఈ అవార్డును స్వీకరించనున్నారు. జ్ఞానభూమి పోర్టల్ ద్వారా ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఫ్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్పులతో పాటు అంబేద్కర్ ఓవర్సీస్, విద్యోన్నతి, బెస్ట్ అవైల బుల్ స్కూల్స్, సివిల్స్ కోచింగ్ తో పాటు హాస్టళ్ల అడ్మిషన్లు మొదలగు సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరచి స్కోచ్ అవార్డు సాధించిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అభినందించారు.