తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
పరాభవనామ సంవత్సర ఉగాది, అందరి జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త అవకాశాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
షడ్రుచులైన తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు కలిసిన ఉగాది పచ్చడి… జీవితంలో కష్టసుఖాలు కలిసే ఉంటాయన్న అర్ధాన్ని మనకు సూచిస్తుంది. జీవితం మనకు అందించే ప్రతి అనుభవాన్ని ఆనందంగా స్వీకరించాలి.
ఈ శుభసందర్భంలో, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్య సంపదలు నిండాలి. ప్రతి ఒక్కరూ సంతోషంతో పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను.