తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా మరొక కీలక చర్య చేపట్టింది. చీమకుర్తి సీఐ ఆధ్వర్యంలో, మర్రిపాలెం గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో జరుగుతున్న కోడిపందేలపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు.విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు, కోడిపందేలు నిర్వహిస్తున్న వ్యక్తులను పట్టుకుని, మొత్తం 3 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 కోడిపుంజులు మరియు రూ.3,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.అక్రమంగా కోడిపందేలు నిర్వహించడం చట్ట విరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు కూడా చట్టానికి విరుద్ధమైన కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండి, తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ప్రకాశం జిల్లా పోలీసులు నేర నియంత్రణలో భాగంగా ఇలాంటి దాడులను నిరంతరం కొనసాగిస్తూ, శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *