తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

ఎప్పుడూ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండే ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, గిద్దలూరులో విద్యార్థులతో కలిసి గడిపిన క్షణాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాలను సందర్శించిన ఆయన, పిల్లలతో కలిసిపోయి సరదాగా మాట్లాడటం, నవ్వులు పంచుకోవడం , పాటల ద్వారా ఆత్మీయ వాతావరణాన్ని సృష్టించారు.
పిల్లల మధ్య కలసి వారి చదువు, ఆసక్తులు గురించి తెలుసుకుంటూ, కొంతసేపు వారితో కలిసి గడిపారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి నవ్వుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు కూడా ఎమ్మెల్యేతో సన్నిహితంగా మాట్లాడే అవకాశం దక్కడంతో ఆనందం వ్యక్తం చేశారు.అంతేకాకుండా, చదువు ద్వారా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చారు. ఈ అనుభవం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, ఎమ్మెల్యే పిల్లలతో గడిపిన ఈ క్షణాలు అక్కడి వారికి చిరస్మరణీయంగా నిలిచాయి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *