తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా 33 మంది లబ్ధిదారులకు ₹14.4 లక్షల విలువైన ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశాను. కందుకూరు పట్టణానికి చెందిన 15 మందికి ₹7.14 లక్షలు, మిగిలిన 18 మందికి ₹7.25 లక్షల సహాయాన్ని అందజేయడం జరిగింది. అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న మన సోదర సోదరీమణులను వ్యక్తిగతంగా కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం నాకు ఎంతో తృప్తినిచ్చింది. గత 20 నెలల కాలంలో మన నియోజకవర్గంలో 33 విడతలుగా, మొత్తం 1245 మందికి ₹9.96 కోట్ల భారీ ఆర్థిక సాయాన్ని అందించగలిగాము. పేద ప్రజల ప్రాణాలకు భరోసానిస్తూ, నిరంతరం నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజల కష్టాల్లో తోడుగా ఉంటూ, వారికి నిరంతరం సేవ చేయడమే నా లక్ష్యం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *