తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి పట్టణం అద్దంకి రోడ్లోని గురుకుల పాఠశాలను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యత, రుచి, తాగునీటి సౌకర్యం తదితర అంశాలపై తెలుసుకున్నారు.భోజనం బాగాలేకపోతే తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచిస్తూ, లీప్ యాప్ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. వంటశాల పరిశుభ్రత, ఆహార నాణ్యత, మెనూ అమలును పరిశీలించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఈ తనిఖీ చేపట్టినట్లు తెలిపారు.