తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

రంజాన్ పండుగ సందర్భంగా శాంతి భద్రతలు, సామరస్య వాతావరణం నెలకొల్పేందుకు జిల్లా ఎస్పీ శ్రీ హర్ష వర్ధన్ రాజు ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా కంభం పట్టణంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు ఎస్సై ఆధ్వర్యంలో పట్టణంలోని 15 మసీదులకు చెందిన ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.పండుగ వేళ ప్రజలు శాంతియుతంగా వేడుకలు నిర్వహించుకోవాలని, ఎలాంటి అపోహలు లేదా వివాదాలకు తావు లేకుండా పరస్పర సహకారంతో ముందుకు సాగాలని పోలీసులు సూచించారు. సమాజంలో శాంతి, సౌహార్దం నెలకొల్పేందుకు మత పెద్దలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.పండుగ రోజుల్లో మసీదులకు భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, ప్రజల సౌకర్యాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ప్రజలందరూ శాంతి, సహనం పాటిస్తూ రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని పోలీసులు ఆకాంక్షించారు. అనంతరం ఎన్‌ఆర్‌ఐ సయ్యద్ రఫీ సర్కిల్ ఇన్స్పెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *