తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద దాతలు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. ప్రయాణికులు, పాదచారులకు ఎమ్మెల్యే స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు. గట్టమనేని సుశీలమ్మ జ్ఞాపకార్థం ఆమె కుమారుడు శ్రీనివాస చౌదరి మరియు పేముల అబ్రహం, దయావతమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే నాగేశ్వరరావు, టిడిపి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షుడు ఉన్నం వీరాస్వామి, పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పట్టణ మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బెజవాడ ప్రసాద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, నియోజకవర్గ తెలుగురైతు అధ్యక్షుడు అల్లం వెంకటేశ్వర్లు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ముచ్చు శ్రీను, బిజెపి నాయకుడు ఉన్నం భాస్కర్, టీడీపీ నేతలు మర్రిపూడి శ్రీను, బత్తిన మాల్యాద్రి, పసుపులేటి రమణయ్య, కొత్తూరి వెంకట సుధాకర్, మురారి శెట్టి సుధీర్, శ్రీకాంత్, గుర్రం చిన్నఅల్లూరయ్య, చలివేంద్రం దాతలు గట్టమనేని శ్రీనివాస్ చౌదరి, పేముల అమృతవాణి, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.