తొలి శుభోదయం న్యూస్ పొదిలి పోలీస్:-

సాధారణ తనిఖీలలో భాగంగా పొదిలి పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలో నమోదైన మర్డర్, క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్ మరియు ఇతర గ్రేవ్ కేసులను సమీక్షించారు. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రేవ్ కేసుల యొక్క నమోదు, పురోగతి, దర్యాప్తు తీరు మొదలగు అంశాలను గూర్చి ఆరా తీసి సదరు కేసుల పరిష్కారంకు దోహదపడే దర్యాప్తు విధానాలపై పోలీసులకు పలు సూచనలు తెలియచేసారు. సర్కిల్ పరిధిలో నేరాలు, శాంతి భద్రతల పరిస్థితి, అసాంఘిక కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించి, తరచుగా చోటుచేసుకునే నేరాలపై అధికారులను ఆరా తీశారు. దర్యాప్తులో ఉన్న కేసులలో వృత్తి నైపుణ్యతతో శాస్త్రీయ పద్ధతులలో దర్యాప్తు చేస్తూ సాంకేతిక పరిజ్ఞానము ఉపయోగించి నిందితులను అరెస్ట్ చేయాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న NBWలను వేగవంతంగా అమలు చేసి, నిందితులను త్వరితగతిన పట్టుకోవాలని అధికారులకు సూచించారు. మైగ్రెంట్ లేబర్స్‌ను తరచుగా తనిఖీ చేస్తూ, కొత్తగా వచ్చిన వారిని గుర్తించి వారి వివరాలను సేకరించడంతో పాటు, లైవ్ స్కానర్ సహాయంతో వారి ఫింగర్ ప్రింట్స్ నమోదు చేయాలని సూచించారు. విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పై దృష్టి సారించాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం ఇంకా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, మైనర్లు వాహనాలు నడపడం చట్టపరంగా నేరమని స్పష్టం చేశారు.మహిళలు మరియు పిల్లల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఎస్పీ సూచించారు. చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని, గంజాయి వంటి మాదకద్రవ్యాలు మరియు ఇతర అనుమానిత వస్తువుల అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా ఎస్పీ వెంట పొదిలి సీఐ ఎం రాజేష్ కుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు, పొదిలి యస్.రాజేష్ ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *