తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలోని చందలూరు గ్రామంలో జరుగుతున్న పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో శాంతి భద్రతలను పటిష్టం చేయడానికి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.“స్కై ఐ ప్రకాశం” ప్రాజెక్ట్‌లో భాగంగా డ్రోన్ సర్వైలెన్స్‌ను వినియోగిస్తూ తిరునాళ్ల ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ పోలీసులు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు, గుమికూడే ప్రదేశాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండుగను శాంతియుతంగా జరుపుకునేలా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు.ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకుని, పండుగలు సురక్షిత వాతావరణంలో జరగేలా కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *