తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-

బాపట్ల పట్టణంలో సేవా స్పూర్తి వెల్లివిరిసింది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చిరంజీవి యూత్ ఆధ్వర్యంలో బాపట్ల శ్రీ పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలలో ఘనంగా రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు విష్ణు మొలకల చంద్రమోహన్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా బాపట్ల జనసేన పార్టీ నాయకుడు విన్నకోట సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం ఎంతో గొప్ప విషయమని, చిరంజీవి యూత్ చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విష్ణు మొలకల చంద్రమోహన్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.అనంతరం చంద్రమోహన్ మాట్లాడుతూ, అభిమానుల ఆరాధ్య దైవమైన మెగాస్టార్ తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని, యువత మరింతగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో ఉన్న మహిళలకు పండ్లు, బ్రెడ్, మజ్జిగ వంటి పోషకాహార పదార్థాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన అభిమానులు, స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవా భావాన్ని చాటుకున్నారు.ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చిరంజీవి అభిమానులు, రామ్ చరణ్ అభిమానులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత ఏసోబు. ప్రత్తిపాటి శ్రీనివాసరావు. తిమ్మని శేషు. కంచర్ల నరేంద్ర. అడ్వకేట్ బెంజి. తాటి కళ్యాణ్ చక్రవర్తి. గొట్టిపాటి శ్రీకృష్ణ. గొల్లపూడి ప్రసాద్. ఆంజనేషో, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *