తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, మనందరి అభిమాన పార్టీ.. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు కందుకూరులో వేడుకలను ఘనంగా నిర్వహించాం. మన ఆరాధ్య దైవం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నాం.నాడు ఎన్టీఆర్ గారు వేసిన పునాది, నేడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ ప్రయాణంలో నిరంతరం కష్టపడుతున్న కార్యకర్తలే పార్టీకి అసలైన బలం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు..