తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ద్విచక్ర వాహనాలు మరియు ఆటోలకు ప్రభుత్వం అనుమతించిన ప్రమాణాలకు విరుద్ధంగా అధిక కాంతి వెలువరించే అనధికార లైటింగ్ అమర్చడం వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులకు స్పష్టత తగ్గి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు.ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, అనధికార హై బీమ్ లైట్లు మరియు ఇతర ప్రమాదకర లైటింగ్‌ను తొలగించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా లైట్లు అమర్చడం చట్టపరమైన చర్యలకు దారి తీస్తుందని హెచ్చరించారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, హైవేపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకపోవడం, ఓవర్‌టేకింగ్ సమయంలో జాగ్రత్తలు పాటించడం అత్యంత ముఖ్యమని సూచించారు.
ప్రజలు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించుకుని, సురక్షిత ప్రయాణానికి పోలీసులకు సహకరించాలని కోరారు.