తొలి శుభోదయం న్యూస్ కోవూరు :-

గ్రామ ప్రథమ పౌరుడన్న పేరే గానీ వీధి లైట్లు వేయించాలన్నా సర్పంచులు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సిన దుస్థితి.గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది.కూటమి ప్రభుత్వంలో అధికారంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం.కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడంలో భాగస్వాములు కండి.కోవూరు నియోజకవర్గ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని ఈ రోజు పదవీ విరమణ చేస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన 43 మంది సర్పంచులకు నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి కార్యాలయంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేసి, నూతన వస్త్రాలతో ఘన సత్కారం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *